Thursday, October 30, 2008

ద్విపదలో ఓటెయ్యండి

నవంబరు 4న అమెరికాలో ఎన్నికలు. ఈమధ్య జరిగిన సర్వేలో (California Bay Areaలో) ఆఫీసుకు ఆలశ్యమవుతుందని చాలామంది ఓటు వెయ్యరని చదివాను. If you don't vote, you lose your right to voice your concerns.


ద్విపద//

ఓటేయరా నీవు ఓటేయకున్న
మాటాడగలహక్కు మట్టిలో మిగులు

డ్యూటీగ భావించు ఓటెయ్యడమును
లేటౌను నాకంటు బ్లేములొద్దోయి

తూటాలకన్న పోరాటాలకన్న
మేటిరా శక్తిలో ఓటుఎన్నడును

ఓటేయరా నీవు ఓటేయకుండ
దాటేసినావంటె తంటాలు నీకె

2 comments:

రాఘవ said...

ద్విపదలు బాగున్నై. కానీ ఒక్క సందేహం. ద్విపద జాతిపద్యం కాబట్టి ప్రాసయతి వాడకూడదని చదివిన గురుతు!

పుష్యం said...

నేను కూడా అలాగే చదివిన గుర్తు. కాని http://groups.google.tl/group/telugu-unicode/browse_thread/thread/0ea44d594fc20ae1/ba6c7fcb534cfcc7 లో సోమనాధుడు ప్రాసయతి కూడా వాడాడని చదివి నేనుకూడా వాడాను. తెలిసిన వారు చెప్పగలరు.