Thursday, October 23, 2008

ఉత్పలమాల

(వ్యాఖ్యల ననుసరించి కొద్దిగా సవరించిన పద్యం)
ఉ//
బ్లాగుని వ్రాయగా తలచి బ్లాగుట నేర్వగ పట్టుపట్టి నే
గూగులు బాగుగా వెదకి కొద్దిగ మార్గము కానరాగ వే
వేగమె బ్లాగునుందెరచి వేసితినొక్క టపాను ఇంక నా
వాగుడు పద్యరూపమున వ్రాయగ యత్నము చేసెదన్ సుమీ!

(మొదట వ్రాసినది)

ఉ//
బ్లాగుని వ్రాయగా తలచి బ్లాగుట నేర్వగ కూరుచుండి నే
గూగులు బాగుగా వెతకి కొంచము జ్ఞానము పొందినంత వే
వేగమె బ్లాగునుందెరచి వేసితి నొక్క టపాను, ఇంకనా
వాగుడు పద్యరూపమున వ్రాయుటకున్ ప్రయత్నించెదన్, భళీ!


8 comments:

దైవానిక said...

బాగుందండి ఉత్పలమాల. మంచి ఆరంభం.

పుష్యం said...

దైవానిక గారు,

ఇది నేను వ్రాసిన మొదటి వృత్తం. అందుకనే కొన్ని పూరక పదాలు కనపడతాయి. ఇంతకు ముందు వ్రాసిన కొన్నీ కందాలు, గీతములు వగైరా. మీకు నచ్చినందుకు చాలా సంతోషం.

నెనరులు,
పుష్యం

రానారె said...

హహ్హహ్హహ్హ ... చివర్లో భళీ కూడ మీరే అనేసుకుంటే మాకేమ్మిగిలింది!? :-)

పుష్యం said...

నిజమే!! మీరు చెప్పేదాకా గమనించలేదు. నన్ను నేను పొగుడుకుంటున్నట్టుంది :-(
ఏదో పద్యం పూర్తి చేయాలన్న గాభరాలో కట్టుపదం ఒకటి పడేసాను. 'ప్రత్నించెదన్ సదా' గా చదుకొన మనవి.

రానారె said...

అబ్బే అలా ఏమీ లేదులెండి. "ఇంక నా వాడుగు పద్యరూపమున వ్రాయుటకున్ ప్రయత్నించెదన్" అని సరదా స్వరంలో చెప్పుకొస్తున్నపుడు మీకుమీరే భళీయని భుజంతట్టుకోవడం కూడా సరదాగానే వుంది. మీ సరదా చూసి నేను భళీ అనాలనుకున్నాను. కానీ అది మీరనేశారు. అందుకే నేనూ మీతోచేరి నవ్వాను తప్ప, ఇందులో తప్పుపట్టడం నా ఉద్దేశం కానేకాదు. నాకంత పాండిత్యమూ లేదు. మీరిలాగే సరదాగా, మంచి వ్యవహారికంలో పద్యాల్జెడం కానివ్వండి కానివ్వండి.

Purnima said...

భళీ.. పద్యమనగానే దూరం పారిపోయే నాకూ అర్థమయ్యే రీతిలో చెప్పారు. నెనర్లు!

పద్యాల్తో ఇంకా అలరిస్తారని కోరుకుంటున్నాను.

రాఘవ said...

వీడెవడ్రా పానకంలో పుడకగాడు అనుకోనంటే ఒక్క రెండు మాటలు... ఒకటి, వ్రాయుటలోన్ భగణంబు పోయెనే! రెండు, పద్యం వ్యావహారిక శైలిలో బాగుంది.

పుష్యం said...

గణభంగమును చూపినందుకు నెనరులు. ఇందులో అనుకోవలసిందేముందండీ!! పుడక మూలానే కదా పానకం చేసిన వాడు శ్రద్ధగా చేస్తునాడో లేదో తెలిసేది :-) "నా వాగుడు పద్యరూపమున వ్రాయగ యత్నము చేసెదన్ సుమీ" గా మార్చి చదవగలరు.