Wednesday, March 11, 2009

శ్రీనాధుడి చాటువు

పని ఒత్తిడి వలన ఈ మధ్య తెలుగు బ్లాగ్లోకంలో గడపడానికి సమయం చిక్కలేదు.


కం//

ఇక్కడి జీవిత మింతే,

లెక్కకు సౌకర్యమున్న లేదులె సమయం;

ఎక్కడ, తీరిక దొరకదు.

చక్కగ ఈ బ్లాగులన్ని చదువుట కొఱకై


చాలా రోజుల తరువాత బ్లాగులు తిరగేస్తూ ఉంటే శ్రీనాధుడి చాటువొకటి కనపడింది.

వెంటనే శ్రీనాధుడి ఇంకొక చాటువు గుర్తుకొచ్చింది.

నా తప్పేంలేదంటూ, అలాంటి సమర్ధింపే ఈ చాటువులో కూడా చూడండి:


గుబ్బలగుమ్మ, లేచిగురు కొమ్మ, సువర్ణపు కీలుబొమ్మ, భల్

గిబ్బిమిఠారి చూపులది, కాపుది, దానికి ఏల ఒక్కనిన్

బెబ్బులి నంటగట్టితివి, పెద్దవునిన్ననరాదు గాని, దా

నబ్బ, పయోజగర్భ, మొగనాలికి ఇంత విలాసమేటికిన్!!


తాత్పర్యం:
ఓ బ్రహ్మా (దానబ్బ, పయోజ గర్భ), ఇంతటి అందగత్తెకు (గుబ్బల గుమ్మ, లేచిగురు కొమ్మ, సువర్ణపు కీలుబొమ్మ) ఒక బెబ్బులి లాంటి వాడినెందుకు అంటగట్టావయ్యా?? అంతే కాకుండా, ఇలాంటి వివాహితకు (మొగనాలికి) ఇంత విలాసమెందుకిచ్చావయ్యా? (కవిహృదయం ఏమిటంటే, ఆమెను వలచడంలో నా తప్పేమీ లేదు, సృష్టించిన నీదే తప్పు అని )




3 comments:

asha said...

తాత్పర్యం కూడా వ్రాస్తే నాలాంటి పామరులు చదువుకోగలుగుతారు.

పుష్యం said...

@bhavani,

మీ సూచనకు నెనరులు. తాత్పర్యం వ్రాసాను చూడండి.

రాఘవ said...

మీరు చెప్పకపోయినా ఈ పద్యాన్ని వ్రాసినది శ్రీనాథుడే అని తెలిసియుండేది.

ఆ పదప్రయోగాలు చూడండి. గుబ్బలగుమ్మ అని మొదలుపెట్టడం, దానబ్బ అని ముగించడం... శ్రీనాథుడే.

అన్నట్టు, ఈమాటలో శ్రీనాథుడి చాటువుల వ్యాసం ఉంది. చూసారా?