లింగమడ్డు వచ్చె గుడిని మ్రింగ బోవ
తే.గీ.
నీతిమాలిన యధికార్లు నిధులు దోచి
లింగమందురతని పేరు లింగరాజు
లింగరాజుండ గుడికిక బెంగ లేదు!
బేరమాడబోవ నేరమాయె
ఆ.వె.
కోమలాంగి యొకతె కూరలమ్ముచు నుండ
యెపుడు సరుకుఁ గొనగ నెరుగని వానికీ
యట్టి శ్రద్ధదేల నడిగె భార్య!
సమస్య - ఉద్యోగములే దండుగ
కం.
"ఉద్యోగములే దండుగ?"
మిథ్యది విను, పొట్టకెట్లు మెతుకులు దొరకున్??
ఉద్యోగము లేకుండిన
సాధ్యమె సుఖజీవనమ్ము, జగతిన శ్యామా?
సమస్య: రక్తి లేని భక్తి ముక్తి నిడదు
భక్తి చిత్రమందు భామల కేబరే
లేమిటనుచు నొకఁడు యీసడించ
దర్శకుండు నవ్వి తాత్పర్యముందెల్పె
"రక్తి లేని భక్తి ముక్తి నిడదు!"
(June 2010)
క్రిందపడిననూ అరిచెను కేరింతలతో
కం||
సందడిఁ జేయకఁ జొరబడిఅందనిదౌ ఉట్టి కొట్టి అపుడు యశోదానందనుడా వెన్నంతయుక్రిందపడిననూ అరిచెను కేరింతలతో
కారమె యనిపించె తీపి కలకండవలే
దోరగ వేగిన గారెలుకారమె యనిపించె, తీపి కలకండవలేబూరెలు తోచెను. మరి పులిహారయు బహు రుచిగనుండె, ఆహా! ఓహో!
(పెళ్ళి భోజనం వర్ణన) (Aug, 2009)
మగనిని కొట్టిన మగువయె మంచిది ఇలలో
జగడములాడ సరసముగ
సిగలో పూదండ కదలి సొగసుగ ఒడిలోతెగిపడిన మల్లె పూలతొమగనిని కొట్టిన మగువయె మంచిది ఇలలో
(June 2009)