మగనిని కొట్టిన మగువయె మంచిది ఇలలో
కం||
జగడములాడ సరసముగ
సిగలో పూదండ కదలి సొగసుగ ఒడిలోతెగిపడిన మల్లె పూలతొమగనిని కొట్టిన మగువయె మంచిది ఇలలో
(June 2009)
పలువురి తండ్రుల తనయుడు భక్తితొ మ్రొక్కెన్
కం//
ఇలలో నింపగునొక స్త్రీ
వలువలు తాఁ మార్చినటుల పతులను మార్చెన్
నలుగురు 'నాన్న'లుఁ గలయా
రావణుని బంటువయితివి రామచంద్ర!
విద్యలేనివాడు వింత పశువు
ఆ.వె:
వేడిగిన్నె చురక వాడిగా తగలగా,వెర్రికేక పెట్టె గొర్రెలాగ,పప్పు చేయబోవ, పలుచగా తేలగా,ఓండ్ర పెట్టెనతడు నోర్వలేక,పాకమువలెనున్న శాకముందినలేక,రంకె వేసెనయ్య రంగచారి,వంట చేసిపెట్ట యింట యిల్లాలు ' శ్రీ,విద్య ' లేని, వాడు, వింత పశువు!!!,
దొరల సాని ఎటుల దొరసాని అయ్యనో
సీ// దొరల సాని ఎటుల దొరసాని అయ్యనో, తెలియజేతు నిపుడు తెలుసుకొనుముఎంతవారైనను కాంతదాసులుకార, తరుణి వలపుతోడ దరికిచేర!వగలు ఒలకబోసి, వయ్యారములుపోయి, సిగన పూలు తురిమి, సెంటు పూసిదొరల సాని అటుల దొరసాని అయ్యెరో, చెంత చేరి అతని చెలిమి చేసి!
సూర్యండుదయించె రాత్రి శుభములు గలుగన్
కం//భార్యామణితో గనె నాచార్యులు డే-నైటు మ్యాచి సాయంకాలంసూర్యుడు కృంగగ విద్యుత్సూర్యండుదయించె రాత్రి శుభములు గలుగన్